వనజీవి రామయ్య ఇక లేరు
NEWS Apr 12,2025 09:09 am
కోటికి పైగా మొక్కలు నాటిన ఖమ్మం వాసీ వనజీవి రామయ్య ఇక లేరు. ఆయనకు 10 ఏళ్ల కిందటే పద్మశ్రీ దక్కింది. గత ఐదు దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ ప్రకృతి ప్రేమికుడిగా పేరు గడించారు. గత అర్ధరాత్రి పద్మశ్రీ వనజీవి రామయ్యకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు అయితే ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.