కమనీయం కోదండరాముడి కళ్యాణం
NEWS Apr 12,2025 08:06 am
కడప జిల్లాలో ప్రసిద్ది చెందిన ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం వేదికగా సీతా రాములోరి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రభుత్వం తరపున స్వామి, అమ్మ వార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 70 వేల మందికి పైగా భక్త బాంధవులు హాజరయ్యారు. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కళ్యాణోత్సవాన్ని తిలకించారు. దివ్య వివాహ వేడుక సాయంత్రం 6:30 గంటలకు భగవత్ విజ్ఞానపథంతో ప్రారంభమై రాత్రి 8:30 గంటల వరకు కొనసాగింది.