సిరిసిల్లలో టెక్స్ పోర్ట్ యూనిట్ స్టార్ట్
NEWS Apr 11,2025 05:15 pm
భారత దేశంలో తొలిసారిగా సిరిసిల్లలో టెక్స్ పోర్ట్ యూనిట్ ను ప్రారంభించారు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్. మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు సుమారు 800 మంది మహిళలకి ఉద్యోగ నియామక పత్రాలు అదజేశారు. ఉద్యోగ శిక్షణనిచ్చి ట్రైనింగ్ సమయంలో రూ.1000 స్టైఫండ్ కూడా ఇస్తున్నామన్నారు. శిక్షణ అనంతరం సిరిసిల్లలోనే టెక్స్ పోర్ట్‌లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతోందన్నారు మంత్రులు.