ఎంపీ నిధులతో బోరు
NEWS Apr 11,2025 04:00 pm
కథలాపూర్ మండలంలోని కథలాపూర్, సిరికొండ గ్రామాలలో బండి సంజయ్ ఎంపీ నుండి విడుదలైన నిధులతో బోర్ వేయించినట్లు బిజెపి మండల అధ్యక్షులు మల్యాల మారుతి తెలిపారు. బీజేపీతోనే పనులు సాధ్యమని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బిజెపి ఉండాలని పిలుపునిచ్చారు, ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా బోర్ వేయించినట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, బద్రి సత్యం, కథలాపూర్ మహేష్, గాంధారి శీను,మహేష్,శ్రీకర్, రాకేష్, గంగమల్లయ,సునీల్, జీవనరెడ్డి, ప్రసాద్, భూమెస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.