లబ్దిదారుల ఇళ్లల్లో ఒక రోజు భోజనం చేయాలి
NEWS Apr 11,2025 09:27 am
తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని రీతిలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని గ్రాండ్ గా అమలు చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్బంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా విధిగా సన్న బియ్యం తీసుకున్న లబ్దిదారుల ఇళ్లల్లో ఒక రోజు భోజనం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సన్నబియ్యం విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో సంవత్సరానికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశామని చెప్పారు.