శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లు
NEWS Apr 11,2025 09:10 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలుమంగమ్మలను 57 వేల 462 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 998 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లు వచ్చిందని వెల్లడించారు ఈవో జె.శ్యామలరావు. స్వామి వారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.