ఘనంగా స్నపన తిరుమంజనం
NEWS Apr 11,2025 08:50 am
తిరుపతి లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీకోదండ రామ స్వామి తెప్పోత్సవాలు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.