భక్త సందోహం ఆంధ్ర ఏకశిలానగరం
NEWS Apr 11,2025 08:44 am
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలరారుతోంది. దీనికి ఏకశిలా నగరం అని పేరు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు చేపట్టిన పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ సముదాయం, కళ్యాణ వేదిక వద్ద అద్భుతమైన ట్రస్ లైటింగ్‌తో ఏర్పాటు చేశారు.శుక్రవారం శ్రీ రాములోరి కళ్యాణం జరగనుంది. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్బంగా ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.