నాగర్ కర్నూల్ జిల్లా వాసికి డాక్టరేట్
NEWS Apr 11,2025 08:52 am
MBNR: వంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన అల్లే నాగయ్య తెలుగు విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి దాశరథి రంగాచార్య జీవితం, సాహిత్యం సమగ్ర పరిశీలన అనే అంశంపై డాక్టర్ జ్యోత్స్న ప్రభ పర్యవేక్షణలో పరిశోధన పూర్తిచేశారు. దీనిపై యువకుడి తల్లిదండ్రులు బాలస్వామి , లక్ష్మమ్మ హర్షం వ్యక్తం చేశారు.