తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతన్నలు
NEWS Apr 11,2025 08:52 am
MBNR: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో మోస్తరు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు నిమిత్తం మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. కాగా కురిసిన వర్షంతో ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.