కేంద్ర సాధికారిక కమిటీకి బీఆర్ఎస్ నివేదిక
NEWS Apr 10,2025 07:57 pm
మాజీ మంత్రి హరీశ్ రావు సారథ్యంలో కేంద్ర సాధికారిక కమిటీకి నివేదిక అందజేశారు. సీఎం ప్రకృతి విధ్వంసానికి పాల్పడే చర్యలు చేపట్టారంటూ ఆరోపించారు. చెట్లను నరికి వేస్తుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ముందుగా ఆన్ లైన్ లో రూ. 100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అటవీ శాఖ ఏం పని చేస్తోందంటూ మండిపడ్డారు. అటవీ శాఖ అనుమతితో ఒక్కో చెట్టుకు రూ.400 డిపాజిట్ చేసిన తర్వాత చెట్టు కొట్టాలన్నారు. సల్మాన్ ఖాన్ ఒక్క జింకను చంపితే జైళ్లో పెట్టారని అన్నారు. సంవత్సరాల తరబడి కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడని , ఈ విషయంలో సీఎంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.