13న ధర్నా విజయవంతం చేయాలి
NEWS Apr 10,2025 02:36 pm
మెట్ పల్లి:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని మెట్ పల్లి మర్కజీ ఇంతేజామీ మిల్లాతే ఇస్లామియా కమిటీ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా డిమాండ్ చేశారు. ఈనెల 13న కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మధ్యాహ్నం రెండు గంటలకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ సోదరులు, అనుబంధ సంఘ నాయకులు, పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని కోరారు.