హనుమంత వాహనంపై రాములోరి విహారం
NEWS Apr 10,2025 11:57 am
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈనెల 11న రాములోరి కళ్యాణోత్సవం జరగనుంది. వేలాది మంది భక్తులు హాజరవుతున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. ఈవో ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక ఉత్సవాలలో భాగంగా విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది.