జోగి రమేష్ కు సీఐడీ నోటీసులు
NEWS Apr 10,2025 10:15 am
వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ కు బిగ్ షాక్ తగిలింది. వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా జోగి రమేష్ కు నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న విజయవాడ సీఐడీ రీజినల్ ఆఫీసుకు రావాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి జోగి రమేష్ మూడుసార్లు విచారణకు హాజరయ్యారు.