గోద్రెజ్ క్యాపిటల్ సర్కార్ కీలక ఒప్పందం
NEWS Apr 10,2025 10:11 am
ప్రముఖ కంపెనీ గోద్రెజ్ క్యాపిటల్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో భేటీ అయ్యింది. ఇందులో భాగంగా MSME అభివృద్ధికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించనుంది. గోద్రెజ్ ఫైనాన్స్, గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో కలిసి ఒప్పందం చేసుకున్నారు. అర్హత ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్లకు తక్కువ డాక్యుమెంటేషన్‌తో రుణాలు అందించనున్నారు. గోద్రెజ్ ‘ఆరోహి’ స్కీమ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, రంగారెడ్డి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో గోద్రెజ్ క్యాపిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు జయేష్ రంజన్.