శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు
NEWS Apr 10,2025 09:32 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 62 వేల 76 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 699 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. దర్శనం కోసం ప్రస్తుతం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 10 గంటలకు పైగా పడుతుందని తెలిపారు.