టారిఫ్ లు విధించినా నోరు మెదపని మోదీ
NEWS Apr 09,2025 06:48 pm
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఏఐసీసీ సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆర్థిక తుపాను వచ్చే ప్రమాదం ఉందన్నారు. మొదటిసారి మోడీ అమెరికాకు వెళ్లినప్పుడు ట్రంప్ ను ఆలింగం చేసుకున్నాని, కానీ ఈసారి ఆ దృశ్యం కనిపించ లేదన్నారు. టారిఫ్ లు వేసినా ఎందుకు మోదీ స్పందించడం లేదని ప్రశ్నించారు. కరోనా తర్వాత కోట్లాది మంది ప్రజలు నష్టపోయే పరిస్థితి వస్తోందని ఆవేదన చెందారు .ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఎక్కడ తలదాచుకున్నారని నిలదీశారు.