రాములోరి కళ్యాణానికి శ్రీవారి లడ్డూ సిద్దం
NEWS Apr 09,2025 01:00 pm
టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తులకు తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 11న సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్బంగా కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ సిద్దంగా ఉందని స్పష్టం చేసింది టీటీడీ.