డాక్టర్ ప్రభావతిపై డిప్యూటీ స్పీకర్ ఫైర్
NEWS Apr 09,2025 06:11 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల విచారణలో డాక్టర్ ప్రభావతి గుర్తు లేదు, తెలియదని చెప్పడం దారుణమన్నారు. తను కేవలం గైనకాలజిస్ట్ డాక్టర్ అని గాయాలపై అవగాహన లేదని అనడం పట్ల మండిపడ్డారు. ఎంబీబీఎస్ చేసిన ఎవరికైనా కనీస అవగాహన ఉంటుందన్న విషయం డాక్టర్ ప్రభావతి ఎలా మరిచిపోయారో ఆమెకే తెలియాలని అన్నారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునే సామర్థ్యం ఉన్న ఆమెకు మరుపు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు .