బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గంకు సన్మానం
NEWS Apr 09,2025 06:14 pm
మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ లను మెట్లచిట్టాపూర్ విడిసి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ న్యాయపరంగానే కాకుండా సామాజికంగా కూడా చేసిన సేవలు వృధా పోలేవని అన్నారు. ఈ కార్యక్రమం లో విడిసి అధ్యక్షులు దండిక శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అమ్మిగల్లా ఆంజనేయులు, కోశాధికారి సదిరెం పెద్ద గంగారాం, నాయకులు గడ్డం పెద్ద సాయిలు, ఎల్ల నరసయ్య, రాజారపు రాజన్న, తంగళ్ళపల్లి సాయిలు పాల్గొన్నారు.