జగన్ శవ రాజకీయాలు మానుకో
NEWS Apr 09,2025 12:15 pm
హోం మంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే జనం ఛీ కొట్టే ప్రమాదం ఉందన్నారు. రాప్తాడులో తన పర్యటన ఓ డ్రామాని తలపించేలా ఉందన్నారు. వైకాపా హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు నడుచుకునేలా చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. 12.42 కి రోడ్డు మార్గం కన్ఫర్మ్ అయ్యిందన్నారు. కొద్ది నిమిషాల్లో చాపర్ బయలు దేరి పోయిందన్నారు. ఇదంతా క్రిమినల్ లీడర్ ఫ్రీ ప్లాన్ అంటూ కొట్టి పారేశారు. ఇలా కూడా ఆలోచన చేస్తారని తాను అనుకోలేదన్నారు అనిత.