గుజరాత్ రాజస్థాన్ నువ్వా నేనా
NEWS Apr 09,2025 09:52 am
ఐపీఎల్ 2025 టోర్నీలో మరో కీలక మ్యాచ్ కు వేదిక కానుంది అహ్మదాబాద్. బుధవారం గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు కొనసాగనుంది. హోం గ్రౌండ్ కావడంతో గుజరాత్ కు అడ్వాంటేజ్ కానుంది. ప్రస్తుతం ఇది 23వ మ్యాచ్ కావడం విశేషం. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. గుజరాత్ టైటాన్స్ జోరుమీదుంది. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో 11 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ , ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లపై వరుస విజయాలు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్ లు ఆడింది. 2 మ్యాచ్ లలో ఓడి పోయి మరో 2 మ్యాచ్ లలో గెలుపొందింది.