వైభవోపేతం శ్రీరామ పట్టాభిషేకం
NEWS Apr 09,2025 07:52 am
తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ఊంజల్ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహ తీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.