ఉరి శిక్ష కంటే నడిరోడ్డుపై కాల్చేయాలి
NEWS Apr 08,2025 04:48 pm
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్ షుఖ్ నగర్ పేలుళ్ల ఘటనలో సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. వారికి ఉరి శిక్ష సరైనదని అభిప్రాయపడింది ధర్మాసనం. ఈ సందర్బంగా ఎమ్మెల్యే స్పందించారు. ఎన్ఐఏ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పేలుళ్ల అనంతరం ఎంతో కష్టపడి టెర్రరిస్టులను పట్టుకున్నారని కితాబు ఇచ్చారు. లేదంటే ఇంకెంతో మందిని పొట్టన పెట్టుకునే వారన్నారు. వారికి ఉరి శిక్ష వేయడం కంటే నడి రోడ్డుపై కాల్చేయాలని డిమాండ్ చేశారు. దీని వల్ల మిగతా వారు భయపడతారని పేర్కొన్నారు.