అనాథ చిన్నారులకు ఆర్థిక సాయం
NEWS Apr 10,2025 10:26 am
ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన అనాథ చిన్నారులు బిటుకు వర్షిణి, అక్షిత్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బాలసాని చంద్రమౌళి, దోనిపల్లి మహేష్ సమిష్టి ఆలోచనలతో ప్రారంభమైన ప్రచారం పక్షం రోజుల పాటు కొనసాగి 3,15,859 రూపాయల ఆర్థిక సహాయాన్ని సమకూర్చి పెట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండల, గ్రామాల దాతలు అందించిన ఈ ఆర్థిక సహాయం అనాధ పిల్లలకు అందించిన అపన్న హస్తంగా నిలిచింది.