కేటీఆర్..రేవంత్ రెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్
NEWS Apr 08,2025 03:18 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ప్రాణ మిత్రులు అన్నారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారని మండిపడ్డారు. చెన్నైలో అఖిలపక్ష భేటీకి ఇద్దరూ కలిసి వెళ్లారని అన్నారు. హైదరాబాద్‌లో సమావేశానికి కూడా ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించేందుకు సిద్ధమయ్యారని బాంబు పేల్చారు. ఈ ఇద్దరు కలిసి బీజేపీని దెబ్బ తీయాలని ప్రయ్నతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై సీబీఐ విచారణకు సిద్దమా అని సవాల్ విసిరారు.