వాలంటీర్ల పేరుతో జగన్ భారీ మోసం
NEWS Apr 08,2025 03:06 pm
వాలంటీర్ల పేరుతో గత సర్కార్ నిట్ట నిలువునా మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాలంటీర్లకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వేతనాలు పెంచడంపై మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చర్చించామన్నారు. అయితే వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి జీవోలు ఇవ్వ లేదన్నారు. సరైన ఉత్తర్వు పత్రాలను, జీతభత్యాలను లేకుండానే వారిని నియమించిందని ఆరోపించారు. గౌరవ వేతనాలు విచిత్రంగా ఎక్కడ నుంచి అందించిందో కూడా తెలియని పరిస్థితి కనిపించిందన్నారు. విచారణలో ఎక్కడా అధికారికంగా నియామకాలు జరగలేదని తేలిందన్నారు.