త్వరలో భారీ భూ స్కామ్ ను బయట పెడతా
NEWS Apr 08,2025 01:00 pm
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల గురించి కాదని, దాని వెనుక వేల ఎకరాల వ్యవహారం ఉందని ఆరోపించారు. ఈ స్కామ్ లో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో ఈ భారీ కుంభకోణాన్ని బయట పెడతానాంటూ ప్రకటించారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందన్నారు. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే..మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి సీఎం రేవంత్‌రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు.
రేవంత్‌ని కాపాడుతోంది బండి సంజయ్ అని , ఇక పొంగులేటి బాంబులు తుస్సు మన్నాయని ఫైర్ అయ్యారు.