విద్యార్థుల ఆలస్యంపై విచారణకు ఆదేశం
NEWS Apr 08,2025 09:24 am
పెందుర్తి ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా కొందరు విద్యార్థులు కాన్వాయ్ కారణంగా జేఈఈ పరీక్షను రాయలేక పోయారంటూ వచ్చిన వార్తా కథనాలపై విచారణ చేపట్టాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఇది వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. వెంటనే నివేదిక ఇవ్వాలని కోరారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్‌ను నిలుపుదల చేశారు? పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్‌ను ఏమైనా నియంత్రించారా? లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు స్పష్టం చేశారు.