శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు
NEWS Apr 08,2025 03:46 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 66 వేల 503 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 941 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 10 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు .