ఏపీలో మరో 15 ఏళ్లు మాదే రాజ్యం
NEWS Apr 08,2025 08:09 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు తమ కూటమిదే పవర్ లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు పాలించిన జగన్ రెడ్డి సర్వ నాశనం చేశారని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు. అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికల్లో మన్యం ప్రాంతమంతా కూటమి పార్టీల జెండాలతో రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. కూటమి సర్కార్ ను దీవించాలని, మీకోసం , రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు.