టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్
NEWS Apr 08,2025 07:44 am
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, లేబర్ కమిషనర్లకు నోటీసులు అందజేశారు. మే6వ తేదీ అర్ధరాత్రి నుంచి తాము సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. మే 7వ తేదీ నుండి సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన చేపడతారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పిందని, తమను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.