విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలి
NEWS Apr 07,2025 06:20 pm
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన 400 ఎకరాల భూముల వివాదంలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించాలని ఆదేశించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో HCU టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ చర్చలు జరిపారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసులు ఉపసంహరించాలని ఆదేశించారు. ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.