శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా
NEWS Apr 07,2025 05:56 pm
మొదటిసారిగా తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య , వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా ఇష్థికఫాల్ స్వాగతం పలికారు.