దేశ వ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు
NEWS Apr 07,2025 04:42 pm
గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. దేశ వ్యాప్తంగా ఈ పెంపు ఇవాల్టి నుంచే వర్తిస్తుందని తెలిపింది. ఎల్పీజీ సిలిండర్ పై రూ. 50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న ఉజ్వల పథకం సిలిం డర్లపై కూడా రూ. 50 పెరిగిందని తెలిపింది. దీంతో సామాన్యులపై గ్యాస్ ధరా భారం తడిసి మోపెడు కానుంది.