భూముల విషయంలో ఎవరికీ నష్టం జరగదు
NEWS Apr 07,2025 12:59 pm
కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధంచి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల కమిటీతో సచివాలయంలో సమీక్ష చేపట్టారు. అంతకు ముందు ఎన్ఎస్ యుఐ విద్యార్థి సంఘాల నేతలతో భేటీ అయ్యారు. కమిటీ సభ్యులతో అన్ని విషయాలు చర్చించామన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థుల లేఖలపై సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రజలకు వివరిస్తామన్నారు.