ఏపీలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్
NEWS Apr 07,2025 12:51 pm
ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు నిలిచి పోయాయి. రూ. 3,500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచి పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 600 ప్రధాన ఆస్పత్రుల్లో ఓపీలతో పాటు వైద్య సేవలు నిలిచి పోయాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. వెంటనే బకాయిలు చెల్లించి పేదలకు వైద్యం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.