రోడ్డు ప్రమాదంపై మంత్రి ఆరా
NEWS Apr 07,2025 12:47 pm
అన్నమయ్య జిల్లా యర్రగుంట్ల వద్ద రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.గ్రీవెన్స్ కు వెళ్తూ ప్రమాదంలో హంద్రీనీవా డిప్యూటీ కలెక్టర్ రమ మృతి చెందటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యులు సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో ఫోన్ లో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.