తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
NEWS Apr 07,2025 10:01 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 72 వేల 960 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వవేల 126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.63 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.