రామసేతును దర్శించుకున్న ప్రధాని
NEWS Apr 06,2025 04:21 pm
శ్రీలంక పర్యటన ముగించుకుని భారత్ కు బయలు దేరారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా ఆయన రామసేతును దర్శించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. యాధృశ్చికంగా అయోధ్యలో శ్రీరాముడికి సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే ఇది జరగడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు పీఎం. రెండిటిని దర్శించుకునే భాగ్యం దక్కిందన్నారు. ప్రభు శ్రీరాముడు మనందరినీ ఐక్యం చేసే శక్తి, ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలన్నారు.