రాములోరికి సీఎం పట్టువస్త్రాలు
NEWS Apr 06,2025 02:36 pm
ఖమ్మం జిల్లా భద్రాచలం ఆలయంలో శ్రీరామ నవమి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సీతా రాముల కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. టీటీడీ తరపున చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ సైతం పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.