భద్రాచలంకు పోటెత్తిన భక్తులు
NEWS Apr 06,2025 08:35 am
శ్రీరామనవమి సందర్బంగా ఆలయాలన్నీ భక్తులతో కిట కిట లాడుతున్నాయి. భద్రాచలంలో కనీస సౌకర్యాలను కల్పించక పోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీవీఐపీల తాకిడితో సాధారణ భక్తులు నానా తంటాలు పడుతున్నారు. గోదావరిలో స్నానం చేసేందుకు, స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు కనీస ఏర్పాట్లు లేక పోవడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నుంచి సీతారామచంద్ర స్వామి దేవస్థానం వరకు రెండు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ కొనసాగుతోంది. మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేయక పోవడంపై మండిపడ్డారు. ఎండా కాలం కావడంతో అవస్థలు పడుతున్నారు.