పంజాబ్ జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్
NEWS Apr 06,2025 09:15 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది రాజస్థాన్ రాయల్స్. వరుస విజయాలతో దూసుకు పోతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు బిగ్ షాక్ ఇచ్చింది. 50 పరుగుల తేడాతో ఓడించింది. ఆర్ఆర్ బౌలర్ల ధాటికి విల విల లాడారు ప్రత్యర్థి బ్యాటర్లు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 205 రన్స్ చేసింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 155 పరుగులకే చాప చుట్టేసింది. అంతకు ముందు రాజస్థాన్ జట్టులో జైశ్వాల్ 3 ఫోర్లు 5 సిక్సర్లతో 67 రన్స్ చేస్తే రియాన్ పరాగ్ 25 బంతుల్లో 43 రన్స్ చేశాడు. 3 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. సంజూ శాంసన్ 38 రన్స్ చేసి వెనుదిరిగాడు.