బీటీ విత్తనాల విక్రయంపై ఆగ్రహం
NEWS Apr 05,2025 06:25 pm
నిబంధనల ప్రకారం ఏ సీడ్ కంపెనీ అయినా రాష్ట్రంతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందన్నారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జలోతు హుస్సేన్. కానీ కొన్ని సీడ్ కంపెనీలు దళారుల సహకారంతో నేరుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు విత్తనాలు విక్రయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక గిరిజనుల మోసం చేసి వారి నుంచి సంతకాలు తీసుకుని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బీటీ విత్తనాల వల్ల ప్రాణాలు పోతాయన్నారు. అసలేం జరుగుతుందో దర్యాప్తులో తేలుతుందన్నారు ఎస్టీ కమిషన్ సభ్యుడు.