మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై కేసు
NEWS Apr 05,2025 11:21 am
మాజీ ఎంపీ హర్ష కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో తప్పుడు ఆరోపణలు చేశారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 196, 197 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై తీవ్రంగా స్పందించారు హర్ష కుమార్. కూటమి ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు ధోరణితోనే తనపై కేసు నమోదు చేయించిందని ఆరోపించారు. నిజా నిజాలు దర్యాప్తు చేస్తే తేలుతుందన్నారు.