ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు
NEWS Apr 05,2025 09:10 am
NGKL: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో దుర్ఘటన జరిగి నేటికీ 46 రోజులవుతోంది. శిథిలాల్లో చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా పనులను కొనసాగిస్తున్నారు. దుర్ఘటన స్థలంలో పేరుకుపోయిన మట్టిని, శిథిలాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపిస్తున్నారు.