రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి
NEWS Apr 05,2025 08:29 am
MBNR: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. పెబ్బేరు మండల పరిధిలోని రైతు వేదికలో వరి ధాన్యం కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతుల కోసం కొనుగోలు కేంద్రాల్లో టెంట్, తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు.