నేపాల్ లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.0 గా నమోదైంది. గర్ఖాకోటకు మూడు కి.మీ దూరంలో, 20 కి.మీ లోతులో భూకంప కేంద్రం గుర్తించారు. నిన్న రాత్రి 7.52 గంటల సమయంలో ఇది రికార్డయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోనూ పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు.