రాములోరి కళ్యాణానికి పవన్ కళ్యాణ్
NEWS Apr 05,2025 08:17 am
శ్రీరామనవమి పండుగ సందర్బంగా భద్రాచలం ఆలయానికి చేరుకుంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీతారామ కల్యాణోత్సవం ఘనంగా జరగనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా ఏపీ సర్కార్ తరపున శ్రీ సీతా రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది కూటమి సర్కార్.