చెన్నై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
NEWS Apr 05,2025 04:28 am
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా శనివారం చెన్నై లోని చిదంబరం స్టేడియంలో కీలకమైన లీగ్ మ్యాచ్ జరగనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ హర్షల్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢీకొట్టనుంది. ఇరు జట్లు బలాల పరంగా సమానంగానే ఉన్నా ఈ మ్యాచ్ ఇరు జట్లకు విజయం సాధించడం ముఖ్యం. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది సీఎస్కే. ఇక ఢిల్లీ సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభం కానుంది.